అరాచక పాలనను అణిచివేద్దాం

రాష్ట్రంలో అరాచక పాలనను ఓటు ద్వారా అణచివేద్దామని మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు అన్నారు. మండలంలోని ముండ్లమూరు పంచాయతీ పరిధిలోగల వేంపాడు గ్రామం వద్ద గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాల ని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టడం సరికాదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలుపన్నినా, చంద్రబాబు నాయుడుకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, జైలు నుంచి కడిగిన ఆణిముత్యం లా బయటకు వస్తారని వారు తెలిపారు. ముందుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడు కేసులు నుంచి బయటకు రావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శంకరాపురం సర్పంచి కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి, ముండ్లమూరు సర్పంచి వద్దిపోగు ఆదిలక్ష్మి గురవయ్య, వేముల సర్పంచి గజ్జెల ఆదెమ్మ సుబ్బారెడ్డి, మాజీ జడ్పిటిసి వరగాని పౌలు, మాజీ ఎంపీపీ కోడిగం మస్తాన్, మాజీ జెడ్పిటిసి కొక్కెర నాగరాజు, మేదరమెట్ల కొండలరావు, కాటూరి గురవయ్య, గంగినేని శేషగిరిరావు, మీనిగా నందగోపాల్, కాసా అంజిరెడ్డి, చుంచు నారాయణ, బరిగే రామ లక్ష్మయ్య, చింతలపల్లి వెంకటస్వామి, కుంటా నాగేశ్వరరావు, ఏరేసి వెంకటేశ్వర రెడ్డి, మేదరమెట్ల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *