బెట్ట పరిస్థితులను తట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలి – ఆత్మ ఫార్మర్ ఓరియంటెడ్ పథకంలో రైతులకు తేమను, పోషకాలను అందించే పుంసా హైడ్రోజలు అందజేత

బెట్ట పరిస్థితులను తట్టుకునేందుకు రైతులు తగిన చర్యలు తీసుకోవాలని డిఆర్సీ వ్యవసాయాధికారులు శైలజారాణి, వెంకట శేషమ్మలు కోరారు. ఆత్మ ఫార్మర్ ఓరియంటెడ్ పథకంలో భాగంగా మంగళవారం కొండెపి మండలం అనకర్ల పూడిలో మిరప పంట సాగు చేయనున్న రైతు వేముల శ్రీరాములు పొలంలో పుంసా హైడ్రోజలు ఉచితంగా పంపిణీ చేసారు. వర్షాలు పడిన సమయంలో నీటికి పుంసా హైడ్రోజల్ తీసుకుని బెట్ట పరిస్థితులలో మొక్కకు అవసరాన్ని బట్టి విడుదల చేస్తుందని చెప్పారు. రైతు పొలంలో పుంసా హైడ్రోజలు ప్రయోగాత్మకంగా వేసి ఫలితాన్ని చూడటం జరుగుతుందని చెప్పారు. ఎకరానికి ఒక కె.జి పుంసా హైడ్రోజల్ ను ఉచితంగా అందించనట్లు చెప్పారు. విఏఏ భరత్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *