జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు..పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు ఆరు చీరలు బహుకరించారు. ఆలయానికి రూ. 12,198 ఆదాయం వచ్చినట్లు ఆర్ఎ శ్రీనివాసరావు తెలిపారు. తహసీల్దార్ ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ యాడిక యలమందా రెడ్డి, ఎం.ఎల్.ఓ మల్లిఖార్జున రెడ్డి తహసిల్దార్ కి స్వాగతం పలికి ఘనస్వాగతం పలికి సన్మానించారు. భక్తులకు కావాలసిన సౌకర్యాలను ఈఓ భాస్కర్ రెడ్డి, ఆలయ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.


