ప్రకృతి వ్యవసాయం అభినందనీయం – రైతు సాధికార సంస్థ (ఆర్ఎ్వఎస్ఎస్) రాష్ట్ర కోఆర్డినేటర్ కర్నాటి ప్రభాకర్ రెడ్డి

ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు పాటిస్తూ మంచి పంటలు వేయటంపై రైతు సాధికార సంస్థ (ఆర్ఎ్వఎస్ఎస్) రాష్ట్ర కోఆర్డినేటర్ కర్నాటి ప్రభాకర్ రెడ్డి అభినందించారు. కనిగిరి డివిజన్ పునుగోడులో బుధవారం ప్రకృ తి వ్యవసాయ ద్వారా సాగు చేసిన పలు కూరగాయలను జిల్లా ప్రాజెక్టు మేనే జర్ సుభాషిణితో కలిసి పరిశీలించారు. రైతు వెలుగొండయ్య వరి గట్లపై వేసిన వంగ, బెండ, బంతి, ఫెన్సింగ్ కి బీర, కాకర, సొర పంటలు సాగును పరిశీలిం చారు. డ్రాప్ ఫ్రూఫ్ మోడల్ లో కంది, ఆముదం, సజ్జ, గోరు చిక్కుడు, అనుములు, అలసంద సాగు చేశారు. రైతు నారాయణ కంది ప్రధాన పంటలో అంతర పంటగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, శనగ, సజ్జ, మినుములు, గోం గూర, వంగ, మిరప, ఆముదం, జొన్నలను పరిశీలించారు. ఎనీటైమ్ మనీ ( ఎటీఎం) ద్వారా సాగు చేస్తున్న కూరగాయలు రైతుల ఆర్థిక అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని కర్నాటి ప్రభాకర్ రెడ్డి అన్నారు. డీపీఎం సుభాషిణి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఫెర్టిలైజ్ లేని ఉత్పత్తుల దుకాణం (ఎన్పీ ఎం)ను పరిశీలించారు. ఎంటీ విజయవాణి, పలువురు రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *