జౌషద మొక్కల పెంపకం పోత్సాహించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఎం. భ్రమరాంబ – వ్యవసాయశాఖ ఎడీఏ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహణ

జౌషద మొక్కల పెంపకాన్ని పొత్సహించి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ భ్రమరాంబ అన్నారు. ఒంగోలు వ్యవసాయశాఖ ఎడీఏ కార్యాయంలో బుధవారం వ్యవసాయశాఖ సిబ్బంది, ఫిషరీస్ సిబ్బంది, రైతులకు జాతీయ ఆయుర్వేద దినోత్సవం అజాదీకా అమృత మహోత్సవ్ బాగంగా ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయుష్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ భ్రమ రాంబ మాట్లాడుతూ …జన ఆరోగ్యం భూమి ఆరోగ్యంగా పై ఆధార పడి ఉంటుందని చెప్పారు. ఔషద మొక్కల పెంపకంతో ప్రజలు ఆరోగ్యం కూడ మెరుగు పడుతుందని అన్నారు. ఉచిత వైద్యశిబిరం నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేసారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మండల వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించి ఔషద మొక్కల పెంపకం పొత్సహించాలని కోరారు. ఎడీఏ రమేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *