వరిలో సమగ్ర పంట యాజమాన్యంతో ఎంతో ముఖ్యమని డిఆర్సీ
వ్యవసాయాధికారులు శైలజా రాణి, శేషమ్మలు అన్నారు. చీమకుర్తి మండలం పాటి మీద వారి పాలెంలో శనివారం ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ ని నిర్వహించారు. గ్రామానికి చెందిన చీదర్ల కోటయ్య పొలంలో సమగ్ర పంట యాజమాన్యాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించారు. జీవన ఎరువులైన అజోస్పైరిల్లమ్, పి.ఎస్.బ ఇ, పొటాషియం కరిగించే ఎరువులను ఎకరానికి ఒక్కోక్కటి 500 మి.లీ మొతాదు చొప్పున 200 కిలోల పసువులు ఎరువుతో కలిపి పొలంలో వెయ్యాలని చెప్పారు. అలాగే వరి యొక్క 2,3 ఆకులు వేసిన ‘దశలో పురుగు ఆశిస్తే దారి ప్రభావం పంటపై ఎలా ఉంటుందో రైతులకు తెలిచేసేందుకు వరి మొక్కలను కత్తిరించి చూపించారు. అలాగే రైతులచే ప్రస్తుత పంట పరిస్థితి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చీమకుర్తి మండల వ్యవసాయికారి డివి భాస్కర్ వివరించారు.


