వర్షాభావ పరిస్థితుల వలన ఎండి పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండా రెడ్డి కోరారు. తాళ్లూరు మండలంలో శనివారం ఆయన బృందంతో కలసి పర్యటించారు. రైతులకు రూ. 50వేలు నష్టపరిహారం చెల్లించాలని, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. తహసీల్దార్ కెవీ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు.

