దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ ను తాళ్లూరు ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వైవీ రమణయ్య శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు సహకారం ఉంటుందని ప్రజలకు ఇబ్బందులు కలుగకుంగా పనిచెయ్యాలని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు. అందరి సహకారంతో పనిచేస్తానని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేసారు.
