నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచటమే అసలైన అభివృద్ధి అని నమ్మి సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా, వాసన్నను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా చేసుకుందామని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. 43వ డివిజన్లో శ్రీరామ కాలనీలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు కె రమణయ్య యాదవ్, ఇన్చార్జి యూవీ సుబ్బారావు, కార్పోరేటర్ కండె స్వాతిరమణయ్య, కండె వెంకటేశ్వర్లు, హనుమంతరావు, వద్దు శ్రీనివాసరావు, క్రిష్ణా రెడ్డి, కండె సురేష్, రోశమ్మ, శివ పార్వతి పాల్గొని ఒంగోలులో వాసన్న చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించే పత్రాలు అందించారు.


