నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచటమే అసలైన అభివృద్ధి అని నమ్మి సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా, వాసన్నను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా చేసుకుందామని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఇన్చార్జి నితిన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్ర రెడ్డి, కార్పోరేటర్ వెన్నపూస కుమారి వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస రెడ్డి, గురువా రెడ్డి, కొండా రెడ్డి, నరసారెడ్డి, విక్రమ్ రెడ్డి, మండతల నాని, చెంచిరెడ్డి, రమణమ్మ, మంజుల తదితరులు పాల్గొని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీ అభ్యర్థికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యధికంగా ఓట్లు వేయించి, వేసి గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.
