బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేని 74,399 మందికి రెండు రోజుల పాటు డోర్ టు డోర్ పింఛన్లు -శశిభూషణ్ కుమార్

బ్యాంకు ఖాతాలు వాడుకలో లేక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) అకౌంట్లలోకి నిధులు బదిలీ కాని 74,399 మంది పింఛనుదారులకు ఈ నెల 4, 5 తేదీల్లో పంపిణీ చేసేందుకు వీలుగా వారి పేర్లను డోర్ టూ డోర్ డిస్ట్రిబ్యూషన్ మోడ్లోకి మార్చడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,49,864 మంది పింఛనుదారులుండగా, ఈ నెల 3 వరకు 64,13,200 నాటికి (97.91 ) పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. డోర్ టు డోర్ 16,57,361 మంది పెన్షన్ దారులు ఉండగా, ఈనెల మూడో తేదీ వరకు 15,95,482 మందికి పెన్షన్లు పంపిణీ చేయగా, డిబిటి ద్వారా 48,92,503 మందికి గాను 48,17,718 (98.47 ) మందికి పెన్షన్ పంపిణీ చేసినట్లు శశిభూషణ్ కుమార్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *