జగనన్న పాలనలోనే అన్ని వర్గాలకు మేలు జరిగిందని వైఎస్సార్ సీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలంలోని రెడ్డినగర్, లక్ష్మీనగర్, పెద ఉల్లగల్లు, చిన ఉల్లగల్లు గ్రామాల్లో శనివారం రాత్రి మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సతీమణి నందిని లతో కలిసి నిర్వహించారు. బూచేపల్లి కుటుంబ సభ్యులకు మహిళలు దిష్టి తీస్తూ.. పూలు చల్లుతూ… హారతులతో స్వాగతం పలుకగా నాయకులు, అభిమానులు గజమాలలో సన్మానించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కులాలకు సమ న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, మరో 600 వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించి ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. అమలు కానీ హామీలతో చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదన్నారు. కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి ఆత్మగౌరవం కాపాడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. నవరత్నాలతో పేదలకు, రైతులకు, మహిళలకు అండగా నిలిచిన జగనన్న రుణం తీర్చుకోలేనిదన్నారు. దేశంలో ఎన్నికల హామీలు వందశాతం అమలు చేసిన ఏకైక సీఎం మన జగనన్నే అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఆరాధ్య
దైవమైన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన
బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఓటమి భయంతో ప్రతిపక్షాలు ఏకమైన కూటమి అభ్యర్థులను ఓటుతో భూస్థాపితం చేసేందుకే ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో చంద్రబాబునాయుడు చేసిన మోసాలను ప్రజలు మరిచిపోవద్దన్నారు. జిల్లా పరిషత్ చైర్ప ర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ …మహిళలు ఆర్థికంగా సమాజంలో గౌరవంగా తలెత్తుకొని తిరిగేలా యాభై శాతం రిజర్వే షన్లు అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దేనన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో చేరాలంటే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడం చారిత్రక అవసరమన్నారు. బూచేపల్లి కుటుంబానికి కులాలు, మతాలు, పార్టీలు, రాజకీ యాలకు అతీతంగా సేవ చేయడమే తెలుసన్నారు. నా కుమారుడు శివపై చూపే మీ ప్రేమాభిమానాలు ఫ్యాన్ గర్తుపై ఓట్లు వేసి ఎమ్మె ల్యేగా శివప్రసాదరెడ్డిని, ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రచారంలో మహిళలు బూచేపల్లి కుటుంబ సభ్యులకు వీర తిలకం దిద్దుతూ, డప్పుల వాయిద్యాలు, హారతులతో అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఆయా కార్యక్ర మాల్లో ప్రధాన నాయకులు అన్నపురెడ్డి భిక్షాలురెడ్డి, వాతల రామి రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చినమాలకొండారెడ్డి, జక్కం రాజా, నరసింహా రెడ్డి, జిల్లెలమూడి శివయ్య. మదమంచి శ్రీను, జిల్లెలమూడి పున్నయ్య, తప్పెట డేవిడ్, నాగరాజు, పి జాన్డేవిడ్ రామమోహన రెడ్డి, మాజీ సర్పంచ్ గొంది వెంకటప్పారెడ్డి, సర్పంచ్ జనమాల నాగేంద్రంపిచ్చయ్య, ఎంపీటీసీ గుణపాటి వెంకటేశ్వరరెడ్డి. రాఘవ రెడ్డి, ఎంపీపీ సుంకర సునీతాబ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ తాతపూడి రత్న రాజు, వైస్ ఎంపీపీలు బంకా రమణమ్మనాగిరెడ్డి, మండల జెసీఎస్ కన్వీనర్ మేడికొండ జయంతి, మండల మాజీ కన్వీనర్ సూదిదేవర అంజయ్య, సర్పంచ్ల సంఘ మండల మాజీ అధ్యక్షుడు చింతా శ్రీని వాసరెడ్డి, రెడ్డి సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరెడ్డి, కార్యక ర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




