ఓటు పై వాసవి క్లబ్ ఆఫ్ బుద్ధ పూర్ణిమ అవగాహన…

ఓటర్లకు ఓటు వేయండి అంటూ వాసవీ
క్లబ్ ఇంటర్నేషనల్ ప్రాథమిక విభాగం అయిన వాసవీ క్లబ్ ఆఫ్ బుద్ధపూర్ణిమ, 4వ దశ పోలింగ్ రోజు మే 13న ఎక్కువ మంది బయటకు వెళ్లి ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఓటరు అవగాహన కార్యక్రమం #GoVote అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. .సికింద్రాబాద్‌ హోటల్‌ పార్క్‌లేన్‌ లో జరిగిన 5 వ సాధారణ సమావేశంలో, వాసవీ క్లబ్ ఆఫ్ బుద్ధపూర్ణిమ ఆధ్వర్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించారు.భారత ఎన్నికల కమిషన్‌తో పాటు అనేక ఏజెన్సీలు,ఎన్ జీ ఓ లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది పట్టణ ఓటర్లు పోల్ డే ని సెలవుగా తీసుకుని ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. వాసవి క్లబ్‌లో బుద్దపూర్ణిమ
లో మేము మా వంతుగా బాధ్యతగా గో ఓట్ఓటర్ అవేర్‌ నెస్ డ్రైవ్ నిర్వహించామని వాసవీ క్లబ్ ఆఫ్ బుద్ధపూర్ణిమ అధ్యక్షుడు ప్రొద్దుటూరు వీరభద్రుడు తెలిపారు.క్లబ్ మదర్స్ డే సందర్భంగా తల్లులను సత్కరించింది .క్లబ్ “టోల్ మోల్ కే బోల్” ఛాలెంజ్ విజేతలకు సరిగ్గా ధరలను ఊహించిన వారికి ఆయా వస్తువులను బహుకరించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *