ధర్మవరం శాసనసభ ఎన్నికల్లో ఎన్. డి. ఏ కూటమి అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు వై సత్య కుమార్ గెలుపు కోసం ప్రచార నిమిత్తం ధర్మవరం తరలి వెళ్ళిన ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు. సత్య కుమార్ నామినేషన్ వేసిన సమయం నుండి ప్రకాశంజిల్లా మహిళామోర్చా ప్రధానకార్యదర్శి బి. విజయరావు నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్మవరం చేరుకున్నారు. సత్య కుమార్ గెలుపు కోసం అహర్నిశలు ప్రచారం నిర్వహించారు. ధర్మవరం ప్రతి డివిజన్లో అక్కడి ప్రజలందరితో మమేకమై ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ధర్మవరం విజయపథంలో నడవాలంటే సత్య కుమార్ గెలుపు అనివార్యమని తెలుపుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర పథకాలను వివరిస్తూ ధర్మవరం సుభిక్షంగా మారాలంటే స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి పథకాల ద్వారా జీవన ప్రమాణం పెరగడానికి కావలసిన అన్ని వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. బాలలు సైతం భారతీయ జనతా పార్టీ పతాకాలను చేపట్టి ప్రచారంలో భాగమై మమేకమై తమ భవిష్యత్తు బంగారుమయం కావాలంటే బిజెపికే ఓటేయాలని ఎలుగెత్తి చాటుచూ ప్రచారం చేశారు.
గురువారం ప్రకాశం జిల్లా బిజేపి మాజీ అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర నాయకులు శిరిసనగుండ్ల శ్రీనివాసరావు తదితరులు ధర్మవరంలో ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా సత్య కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ గత ఇరవైరోజులకు పైగా ధర్మవరంలో ఉండి ప్రచారం నిర్వహిస్తున్న ప్రకాశం మహిళా మోర్చా నాయకులను అభినందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం అవ్వాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్ధి వై సత్యకుమార్ కు ఓటు వేసి గెలిపించాలని ధర్మవరం ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రచారం నిర్వహిస్తున్న వారిలో ప్రకాశం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి విజయరావు, మహిళా మోర్చా జిల్లా ఇన్చార్జి తీగల సత్యవతి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రంధి సత్యనారాయణ ఉన్నం నాగేశ్వరరావు, దిండి నారాయణ రెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

