నగరం లో పల్లు చోట్ల కురుస్తున్న భారీ వర్షం నేపథ్యం లో జి హెచ్ ఎమ్ సి అధికారులు మరియు వారి సర్కిల్ పరిది లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లకు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నిలిచిపోయిన నీటిని జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు.రోడ్లపై నిలిచిపోయిన నీటితో పాటు విరిగిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని ఆమె సిబ్బందిని ఆదేసించారు.ఇంజనీరింగ్ అధికారులందరూ తమతమ ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించాలని డిప్యూటీ మేయర్ ఆదేశించారు.
జిహెచ్ఎంసి కంట్రోల్ రూమ్ కు వచ్చే సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బందికి వెంటనే తెలియజేయాలని సూచించారు.జంట నగర వాసులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే జిహెచ్ఎంసి కాల్ సెంటర్ కి ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.
