ఒంగోలు బ్రాంచ్ కాలువలోకి సాగర్ జలాలు

తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు ఆది వారం ఒంగోలు బ్రాంచ్ కాలువకు చేరాయి. మూడు రోజుల క్రితం డ్యామ్ నుంచి కుడి కా లువకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు 4700 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఆ నీరు సాగర్ ప్రధాన కాలువ 85/3 మైలు (ప్రకాశంబార్డర్) వద్దకు వచ్చే సరికి 2200 నీరు పంపిణీ అవుతుంది. అక్కడ నుంచి దర్శి బ్రాంచ్ కాలువకు వచ్చే సరికి 1200 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్ కాలువకు 600 క్యూసెక్కులు నీరు సరఫరా అవుతుంది. తాగునీటి చెరు వులను నింపేందుకు మాత్రమే నీటిని విడుదల చేయడంతో ఎన్నెస్పీ అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి చౌర్యం జరగకుండా నిరంతరం కాలువపై పర్యటిస్తు న్నారు. దర్శి ఎన్ఎస్పీ డీఈ అక్బర్ బాషా ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని మేజర్లను పరిశీలిస్తున్నారు. మేజర్లు ఎత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ …సాగర్ జలాలను కేవలం తాగునీటి అవసరా లకే విడుదల చేసినందున రైతులు గుర్తించాలన్నారు. ఎవరైనా నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *