ముగ్గుల పోటీలకు విశేష స్పందన – బహుమతులు అందించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్ఆర్సిపి దర్శి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి

సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. 208 మంది ముగ్గుల పోటీల్లో పాల్గొనగా అందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. మొదటి బహమతి పావని జానకి ఎయిర్ కండీషనర్, రెండో బహుమతి ప్రత్యూష వాషింగ్ మెషీన్, మూడో బహుమతి ఆవుల నాగఅనిత ఫ్రిజ్, నాలుగో బహుమతి పేరం మనోజ్ఞ ఎస్ఈడీ టీవీలు గెలుపొందారు. న్యాయనిర్ణేతలుగా ఎంఈఓ-2 రమాదేవి, సాయి నర్శింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ ఝాన్సీలు వ్యవహరించారు. వారికి బూచేపల్లి వెంకా యమ్మ, శివప్రసాద్ రెడ్డిలు బహుమతులు అందజేశారు. షేక్ కార్పొరేష్ డైరెక్టర్, వైద్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, పీడీలు అంజిరెడ్డి, సాంబశివరావు, మాజీ ఎంపీపీలు ఇత్తడి దేవదానం, గోళ్ల పాటి మోషే, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కేవీ రెడ్డి, సాగర్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ సద్ది పుల్లారెడ్డి, కౌన్సిలర్లు ఆవుల జ్యోతి, మేడం మోహన్ రెడ్డి, సర్పంచ్ కేసరి రాం భూపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు చంద్రగిరి గురవారెడ్డి, ఉడుముల వెంకటరెడ్డి, నాయకులు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, కర్ణా వెంకటరెడ్డి, పీడీలు అంజిరెడ్డి, నర సింహారెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కళాంజలి ఈవెంట్స్ ఆధ్వర్యంలో....

కళాంజలి ఈవెంట్స్ ఆధ్వర్యంలో డ్యాన్స్ మాస్టర్ డిడ్ల రమేష్ నేతృత్వంలో శనివారం నిర్వహించిన సంక్రాతి సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గులు పోటీలు నిర్వ హించి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఒంగోలుకు చెందిన విద్యార్థులతో నిర్వహించిన క్లాసికల్ డ్యాన్స్ లు , జడర్దస్త్ టీమ్ లు నిర్వహించిన కామెడీ షోలు అందరినీ అలరింపజేశాయి. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై చప్పట్లతో హోరెత్తించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్ఆర్సిపి దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు మాట్లాడుతూ… సంక్రాతి సందర్భంగా రమేష్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు బిజ్జం శ్రీని వాసరెడ్డి, సోము దుర్గారెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, వెన్న పూస బాపిరెడ్డి, భాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *