శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులు ప్రజలపై వుండాలి…తలసాని.

శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆశీస్సులు ప్రజలు అందరిపై ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి జయంతి సందర్భంగా రాంగోపాల్ పేట డివిజన్ జీరా లోని పురాతన లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం నిర్వహకులు సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట రాంగోపాల్ పేట డివిజన్ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆలయ నిర్వహకులు నర్సింహ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *