“మేము గెలుస్తాం.. దమ్ముంటే బెట్ పేట్టుకోండి.. అయితే స్వల్పమెజార్టీతోనే బయటపడతాం…” ఇదీ ఇప్పుడు అభ్యర్థుల శిబిరాల నుంచి వినిపిస్తున్న మాటలు. ఏ నియోజకవర్గంలో అడిగినా నాలుగైదు వేల లోపు మెజార్టీతోనే తమ అభ్యర్థి గెలుస్తాడను కుంటున్నామనే చర్చ పార్టీ కార్యకర్తల మధ్య సాగుతోంది. ఎందుకంటే ఓటింగ్ సరళి ఇప్పటికీ అభ్యర్థులకు అంతుచిక్కడం లేదు. తూర్పు ప్రాంతంలో కూటమికీ, పశ్చిమాన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులకు అవకాశాలున్నాయనేది సాధారణ విశ్లేషణ. నియోజకవర్గాల్లో పార్టీలకు ఉన్న పునాదులు.. గతంలో గెలిచిన నేపథ్యం రీత్యా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిదనేది
సుస్పష్టం.
ఈ ఎన్నికల్లో మారిన పరిస్థితుల రీత్యా వైఎస్ఆర్ సిపి కి బలంగా ఉన్న రెండు నియోజకవర్గా ల్లోనూ ఈసారి ట్రెండ్ మారిందంటున్నారు.
అక్కడా స్వల్ప మెజార్టీ లపైనే ఉన్నారు. ఏదేమైనా ఉమ్మడి ప్రకాశంలో చెరి సగం గెలుస్తారనే ధీమాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఎవరికి మొగ్గు ఉంటుందనేదీ చూడాలి. అందరూ ఫలితాల రోజు కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 4న కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. -అభ్యర్థులు వారం రోజులు ఇతర ప్రాంతాల్లో విశ్రాంతిలో ఉన్నారు. కొందరు దేవాలయా లను సందర్శిస్తున్నారు. దైవదర్శ నాల్లో ఉన్నారు. గెలుపు కోసం మొక్కులు తీర్చు కుంటున్నారు. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. వాటి నుంచి బయటకు తీసే రోజు కోసం అందరూ ఉత్కంఠగానే ఎదురు చూస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్లంతా వచ్చి ఓటేసి పోయారు. గతంలో ఇంత ఉత్సాహంగానూ పట్టుదలగా ఓటేయలేదు.
ఈ ఓటు ఎటు వైపు పడినది అనేది స్పష్టత లేదు. సైలెంట్ ఓటింగ్ ఎటు వైపు ఉన్నది అనే దానిపై స్పష్టత రాలేదు. గుంభనం కొనసాగుతోంది. ఎవరికి వారే తమకు అనుకూలంగా ఓటు పడిందని చెప్పుకుంటున్నారంతే.. ఓటర్లు మాత్రం ఎవరికి ఓటేసిందనేదీ బయటకు చెప్పడం సాధ్యం కాదు.
గ్రామాల్లో పార్టీ గ్రూపుల్లో ఉన్న వ్యక్తులను తప్ప సాధారణ జనాన్ని ఏదో ఒక వైపు వేసుకోవడం కష్టం. ఏదేమైనా ఈసారి భారీ మెజార్టీలు వినిపిం చడం లేదు. అందరినోటా స్వల్ప మెజార్టీలే వినిపిస్తున్నాయి. తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు సునాయాసం అంటున్న కొండపి, సంతనూతలపాడు, కనిగిరి, నియోజకవర్గాల్లోనూ రెండు వేలలోపే మెజార్టీ అనే చర్చ వినిపిస్తోంది. ఒంగోలులో ఇద్దరూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో 23 వేల మెజార్టీతో గెలిచిన బాలినేని ఇప్పుడు ఆయన శిబిరం నుంచే 9,500 + మెజార్టీ అంచనాలు వేశారు. వార్డులు, గ్రామాల వారీగా మెజార్టీలు లెక్కకట్టారు. తెలుగు దేశం అభ్యర్థి దామచర్ల కూడా 16 వేల మెజా ర్టీతో గెలుస్తారని ఆయన అనుచరులూ గణాంకాలు తీశారు. ఇందులో 8 వేలు పక్కా అంటున్నారు. ఇలా రెండు శిబిరాలూ స్వల్ప మెజా ర్టీలకు పడిపోయాయి. దర్శిలో
నువ్వానేనా అన్నట్లుగానే ఉంది. వైఎస్ఆర్ సిపి అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఎడ్జ్ లో గేలుపుకు అవకాశం ఉన్నట్లు చర్చ ఉంది. ఈయన కూడా మూడు నాలుగు వేలలోపేనంటున్నారు. తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వర్గీయులూ రెండు వేలలోపు – మెజార్టీతోనైనా – గెలిచే – అవకాశాలున్నా యంటున్నారు. ఇలా ఎవరికి వారే స్వల్ప మెజార్టీలతో బయటపడతామనే ఆశగా ఉన్నారు. గత ఎన్నికల్లో గిద్దలూరులో 80 వేలు రాగా కనిగిరి, వైపాలెం, దర్శిలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులకు 40వేలకు పైగానే వచ్చింది. అవన్నీ ఇప్పుడు తారుమారయ్యాయి. ఇప్పుడు పది వేల మెజార్టీ గ్యారంటీ అనే మాటే లేదు. ఏదేమైనా మరో వారం రోజులు ఈ ఉత్కంఠ తప్పేలా లేదు.
