చరిత్ర మరువని నేత ఎన్ టీ ఆర్….సినీ వినీలాకాశంలో ధృవతార..…సినీనటులు.నంద మూరిబాలకృష్ణ.

దివంగత ముఖ్యమంత్రి,తెలుగు జాతి గుండె చప్పుడు చరిత్ర మరువని అజరామరుడు నంద మూరీ తారక రామారావు అని సినీ నటులు ఎన్ టి రామారావు తనయుడు నంద మూరి బాలకృష్ణ అన్నారు.మంగళ వారం ఎన్ టీ ఆర్ 101 వ జయంతి సందర్భంగా ఎన్ టీ ఆర్ ఘాట్ లో నందమూరి తారక రామారావు విగ్రహానికి ఆయన తనయులు బాలకృష్ణ,రామకృష్ణ. లు ఘనం గా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతి అన్నగా పిలుచు కొనే అదృష్టాన్ని ఆయన దక్కించు కున్నారని అన్నారు. 320 సినిమాలలో ఆయన నటించారని అన్నారు.రాజకీయాల్లో కూడా ఆయన తన మార్క్ చూపించారని.సరికొత్త నిర్వచనాన్ని చెప్పారని అన్నారు .ఎప్పటికీ ఆయన తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిల్చి వుంటారని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు
మంగళ వారం ఎన్ టీ ఆర్ ఘాట్ లో నందమూరి తారక రామారావు కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని సీ ఏం ,సి ఎం అంటూ నినాదాలు చేశారు.

నివాళులు అర్పించిన పురంధేశ్వరి
ఎన్ టి ఆర్ జయంతి సందర్భంగా దగ్గు బాటి పురంధేశ్వరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు నివాళులు అర్పించారు.

నివాళులర్పించిన లక్ష్మి పార్వతి.
ఎన్ టి ఆర్ 101 వ జయంతి సందర్భంగా రామారావు సతీమణి లక్ష్మి పార్వతీ ఎన్ టి ఆర్ ఘాట్ లో నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *