తాళ్లూరుమండలం శివరాంపురంలోని రైతులతో పండించిన నువ్వుల పంటకు అంతర్జాతీయ స్థాయిలో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ ( గ్యాప్) విశిష్ట గుర్తింపు వచ్చిందని అందుకు కృషి చేసిన మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు సిబ్బంది, రైతుల కృషి అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి (జెడిఎ) ఎస్ శ్రీనివాసరావు అన్నారు. నాణ్యమైన వంట ఉత్పత్తులు సాధించి, గిట్టుబాటు ధరలు వచ్చేలా రైతులకు అధిక ఆదాయం, గరిష్ట లబ్ది చేకూరేలా గతేడాది రబీ వంట కాలంలో విశేష కృషి చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. శివరాంపురం పర్యటనలో భాగంగా రైతులు వండించిన నువ్వులు యలమంచిలి-66 రకం ఉత్పత్తులు రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటేలా రైతులు కష్టాలని రెట్టింపు ఫలితం వచ్చేలా తక్కువ ఖర్చుతో దిగుబడులు వచ్చేలా తొలి వేదికయైన పొలం బడి కార్యక్రమంలో మేలైన వ్యవసాయ యాజమాన్య పద్దతులు పాటించేలా చేయడం జరిగిందని ఏవో ప్రసాద్ రావు తెలిపారు. మన రైతులు పండించిన నువ్వులు కఠిన మైన నాణ్యతా పరీక్షలకు నిలిచి, అందరికి ఆహార యోగ్యంగా ఉండేలా నిండి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ( జిఏపి) సర్టిఫికేషన్ దృవీకరణ కార్యక్రమాన్ని రబీ 2023పంటకాలంలో అమలయ్యేలా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటగా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ను నువ్వు వంట ద్వారా రాష్ట్రానికే, వ్యవసాయ శాఖకే పేరు తెచ్చిన మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు అని, కమీషనరేట్, రాష్ట్ర అధికారులు వెప్పడం జరిగింది. రైతులను ఎంపిక చేసుకుని రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం నామమాత్రంగానే వాడి, సేంద్రియ, ప్రకృతి సాగు పద్ధతుల్లో వండించేలా అడుగడుగునా వీఏఏ ఎం.రాజశేఖర్ రెడ్డి, ఏవో బి.ప్రసాదరావు ఎంతో కృషి చేశారని రైతులు, సంతోషం వెలిబుచ్చారు. ఈ నువ్వులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల దృవీకరణ సంస్థ (ఏపీఎస్ పీసీఏ) గ్యాప్ దృవీకరణ సంస్థగా వ్యవహారించిందని, రైతుల ఉత్పత్తుల శాంపిళ్ళను యురేకా ఎనలిటికల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్, బెంగుళూరు పరీక్షా కేంద్రానికి పంపించగా అన్ని అంశాలలో మంచి ఉత్పత్తులు పాసైనాయని, అవి అన్ని ఎఫ్ఎస్ఎస్ఆర్ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ రెగ్యులేషన్-2011) యాక్ట్
ప్రకారం గుడై ప్రొడక్ట్ నిర్ధారించబడినాయని, సంస్థ ప్రతినిధులుశివబాలన్ దృవీకరించారు. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో కూడా అమ్ముకోవడానికి 40 దేశాలకు పైగా వాటిని వంపించుకోవడానికి వీలుకలిగిందని ఏవో బి. ప్రసాదరావు తెలిపారు. పటిష్టమైన నాణ్యత ప్రమాణాలు పాటించి, అంతర్గత ఆడిట్ నిర్వహణ, వ్యవసాయ క్షేత్రాల అంతర్గత తనిఖీలు రైతులు తామంతటా తాముగా రికార్డుల తయారు, శిక్షణలు సరైన సమయంలో శాస్త్రీయంగా నిర్వహించడం సాంకేతికతను పాటించడం ఈ కార్యక్రమానికి బలంచేకూర్చాయని ఏవో వివరించారు.. తుది తనిఖీలు నిర్వహించి ఏపీఎసిపీసీఏ వారు నమూనాలను బెంగుళూరు, గుంటూరు పంపించి కఠిన పరీక్షలతో పాసైనందున అంతర్జాతీయ స్థాయిలో గ్యాప్ గుర్తింపు వచ్చిందని ఏవో చెప్పారు. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ (గ్యాప్) సర్టిఫికెట్ తాళ్లూరు మండలం వ్యవసాయ అధికారుల బృందానికి పలువురు రైతులు అధికారులు అభినందనలు తెలిపారు.


