ఎన్నికల కౌటింగ్ పూర్తయ్యే వరకు రాజకీయ పార్టీల నాయకులు సం యమనం పాటించాలని ఎస్ఐ వైవీ రమణయ్య సూచించారు. గురువారం రాత్రి తాళ్లూరు పోలీసే స్టేషన్లో లో శాంతి కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయ కులు పూర్తి సహాయ సహకారాలు అందించారన్నారు. అలానే ఎన్నికల కోడ్ ముగిసే వరకు సహ కరించాలన్నారు. కౌటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ కూడా దుందుడుకు చర్యలకు పాల్పడరాదన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉద్దేశ్య పూర్వకంగా అల్లర్లు సృష్టిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు.
