దర్శి అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిం ది. 14 బూత్ లను ఒక రౌండ్ గా అధికారులు 14 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కించారు. మొదటి రౌండ్ నుంచి 17వ రౌం డ్ వరకు సజావుగా సాగిన కౌంటింగ్ అక్కడ నుంచి టీడీపీ ఏజంట్లు, నాయకుల గొడవలతో నిలిచిపోయింది. రాత్రి పొద్దుపోయే వరకు ఎలాగైనా దర్శిని కూడా టీడీపీ ఖాతాలో జమ చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు చేసేది లేక వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి 2597 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
