మక్తలా ఫౌండేషన్ ఆధ్వర్యం లో మొక్కలు నాటడం పై అవగాహన. మొక్కలు పంపిణీ.

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామ్ గోపాల్ పేట డివిజన్ పరిధి లోని సోమసుందరం వీధిలో మొక్కలు నాటడం తో పాటు మొక్కలు పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షణ అనే అంశం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మక్తాల ఫౌండేషన్ చైర్మన్ జలంధర్ గౌడ్ మాట్లాడుతూ ….పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సోమసుందరం వీధిలో మొక్కలను నాటారు. పర్యావరణాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యం లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదం తో కూడిన ఫ్లెక్సీలను ఆయన ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోరుతూ ఆయన తన ద్విచక్రవాహనంపై ఫ్లెక్సీలతో మొక్కలను పెట్టుకొని ప్రజల్లో పర్యావరణం పట్ల ఉండాల్సిన బాధ్యత గుర్తు చేస్తూ అవగాహన కల్పించారు. కాలుష్య నివారణలో భాగంగా మోటారు వాహనాలకు బదులుగా సైకిళ్లను వాడాలని ఆయన కోరారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి సంరక్షించాలని,విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కె. వేణు, జె. సుబ్రమణ్యం, మహేష్, యం. వేణు, జె. భాస్కర్ తదితరులు పాల్గోన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *