ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోని హిందూపూర్ నియోజక వర్గం నుంచి మూడవ సారి శాసన సభ్యుడిగా (హ్యాట్రిక్)సాధించిన నందమూరి బాలకృష్ణ ను టీ టి డీ పీ బీ సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్ గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీపతి సతీష్ కుమార్ మాట్లాడుతూ తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే శ్రీపతి రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్ టి ఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా సేవలు అందించారని అన్నారు. నందమూరి కుటుంబంతో తమకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని,నందమూరి బాలకృష్ణ దివంగత ఎన్ టీ ఆర్ లాగానే అటు చలన చిత్ర పరిశ్రమలో తెలుగు వారికి అత్యంత ప్రియమైన కథానాయకుడిగా వుంటూనే ఇటు రాజకీయాలలో కూడా రాణిస్తున్నారని అన్నారు.హిందూ పూర్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించడం ఆయన నిబద్ధతకు ప్రజలు కట్టిన పట్టం అన్నారు.నందమూరి బాలకృష్ణకు ఈ సందర్భంగా పుష్ప గుచ్చన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు .

