బేగంపేట అల్లం తోట బాయి లో హత్య -వికలాంగుడు ని తలపై రాయితో మోది ముళ్ళ పొదల్లో పదవేసిన నిందితుడు -స్థానికుల సమాచారం తో సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుని భార్య -108 సహాయం తో గాంధీకి తరలింపు.తీవ్ర రక్త స్రావం తో అప్పటికే మృతి చెందిన అయ్యప్ప -కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం పోలీసులు వేట.

బేగంపేట అల్లం తోట బాయి లో శుక్రవారం ఒక వికలాంగు ని తలపైన బండ రాయితో మోది హత్య చేశారు .ఈ ఘటన తో ఒక్క సారిగా అల్లం తోట బాయి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.వికలాంగుడు నీ హత్య వెనుక అసలు సూత్రధారులు ఎవరూ.అసలు హత్య ఎందుకు జరిగింది ఆన్న కోణం లో పోలీస్ లు దర్యాప్తు. చేస్తున్నారు.పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి.బేగంపేట అల్లంతోట బాయి లో నివసించే అయ్యప్పకు గాయత్రి తో 10సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.ఇతను పార్క్ లైన్ దగ్గర ప్రింటర్ షాప్ లో పనిచేస్తున్నాడు .పుట్టుకతో అయ్యప్ప వికలాంగుడు.స్వరాష్ట్రం తమిళనాడు అయినప్పటికీ గత 45ఏళ్లుగా హైదరాబాద్ లోని అల్లంటోట బాయి లో నివాసం వుంటున్నారు.ఉదయం 9.30నిలకి ఇంటినుంచి బయలుదేరి పనికి వెళ్లి రాత్రి 10గంటలకు తిరిగి ఇంటికి వస్తుంటాడు.ఎప్పటి లాగానే 7వ తేదీ శుక్రవారం కూడా బస్సు లో ప్రయాణించి పనికి వెళ్ళాడు.రాత్రి గం 8లకు అల్లాంతోట బాయి ఆర్ కే టవర్స్ వెనుక వైపు ముళ్ళపొడల్లో అయ్యప్ప తల పగిలి పోయి పడివున్నదంటూ స్థానికులు అయ్యప్ప భార్య గాయత్రికి సమాచారం ఇచ్చారు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చూడగా అయ్యప్ప రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన ఆమె స్థానికుల సహాయంతో 108 కు సమాచారం ఇచ్చారన్నారు.అయ్యప్పను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు తెలియ జేశారు.అయ్యప్ప గాయత్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.హత్యకు కారణాలు పోలీస్ దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం వుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *