టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం! -యువనేత మాగుంట రాఘవరెడ్డి

టీడీపీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన కార్యకర్తలకు మాగుంట కుటుంబం అండగా ఉంటుందని యువనేత మాగుంట రాఘవరెడ్డి అన్నారు. తాళ్లూరులోని మాజీ సర్పంచ్, సీనియర్ నాయకుడు ఐవీ రమణారెడ్డి ఇంటి వద్ద శనివారం టీడీపీ శ్రేణులతో ఆయన మాట్లాడారు. రాఘవరెడ్డిని మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కలిసి సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, ఐడమ కంటే శ్రీనివాస్ రెడ్డి ,వల్లభనేని సుబ్బయ్య, శాగం కొండారెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, గొల్లపూడి వేణు బాబు, షేక్ కాశీంసైదా, షేక్ మీరామొహిద్దీన్, వి సి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *