వ్వవసాయంలో వస్తున్న నూతన సాగు విధానాలలో మేలైన పద్ధతులు పాటించి ప్రపంచంలోని దేశాలలో మన ఉత్పత్తులను అమ్ముకునేందుకు కావలసిన సర్టిఫికేట్ విధి విధానాలను అమలు పరచేందుకు నిర్వహిస్తున్న జాతీయ సెమినార్కు మన రాష్ట్రం నుండి తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావును ఎంపిక చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమీషనర్ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.
పొలం బడి కార్యక్రమంలో మేలైన సాగు పద్దతులను జోడించి పంట ఉత్పత్తులను రైతుల ద్వారా పండించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సేంద్రీయ దృవీకరణ సంస్థ ద్వారా రాష్ట్రంలో మొట్ట మొదటగా నువ్వుల పంటకు స్కోప్ సర్టిఫికేట్ వచ్చేలా కృషి చేసిన తాళ్లూరు వ్యవసాయాధికారి జాతీయ సెమినార్కు ఎంపిక కావటం పట్ల తాళ్లూరు మండల రైతులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఎన్ఐఆర్డీ లో జూన్ 10 నుండి 14వరకు ఐదు రోజుల పాటు జరిగే సెమినార్లో వ్యయసాయాధికారి పాల్గొన నున్నారు.

