వానకాలం ప్రయాణాల్లో ప్రమాదాలు పొంచి ఉంటాయి -చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణం – ట్రాఫిక్ నియమాలను పాటించండి ప్రమాదాలను నివారించండీ – బేగంపేట టి టీ ఐ ఏ సీ పీ శంకర్ రాజు.

వానా కాలం ప్రయాణాలలో ప్రమాదాలు పొంచి వుంటాయని,చిన్న పాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు తావు ఇస్తుందని ,అందుకే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏ సీ పీ జీ.శంకర్ రాజు అన్నారు.సోమవారం బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్
సిబ్బంధి అద్వర్యంలో ఏ పి. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, తెలంగాణ డివిజన్, అబిడ్స్ లో సిబ్బంధికి రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా ఏ సీ పీ శంకర్ రాజు మాట్లాడుతూ వర్షాకాలంలో వాహనాలు చాలా జాగ్రత్తగా నడపాలి, వానకాలం వచ్చిందంటే రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయి. సాధారణ రోజులతో పోలిస్తే. వానలు కురిసే వేళ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రోడ్లు పాడవడం, నీటితో నిండి పోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు జరిగితే, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతాయాన్నారు రోడ్లపై టైర్లు జారడం ద్వారా బ్రేక్ వేసినా ద్విచక్రవాహనాలు, కార్లు కొన్ని సందర్భాల్లో ఆగవన్నారు. వానకాలంలో ప్రయాణాల విషయంలో కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణాన్ని సాఫీగా సాగించవచ్చన్నారు . అతివేగం ఎప్పడూ మంచిది కాదు.. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో వాహనాలను వేగంగా నడపకూడదు. రోడ్లన్నీ నీటితో ఉండడం వల్ల తెరిచిన మ్యాన్ హోల్లలోపడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, టైర్లు స్కిడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో వాహనాలను మితిమీరిన వేగంతో నడపకుండా ఉండడం ఉత్తమమన్నారు .రోడ్డుపై వెళ్లేప్పుడు ముందున్న వాహనాలకు మధ్య దూరాన్ని పాటించాలి. వర్షం కురుస్తుందన్న ఆతృతలో ఎట్టి పరిస్థితుల్లో వేగంగా వెళ్లకూడదు. నీటి కారణంగా కొన్ని సందర్బాల్లో బ్రేకులు సరిగ్గా పనిచేయవు దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ముందున్న వాహనాల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. ఇక వాన కాలం వాహనాల అద్దంపై పడే నీటిని ఎప్పటికప్పడు తొలగించకపోతే రోడ్డు సరిగా కనిపించక ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి వైపర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. వర్షాకాలం త్వరగా చీకటి పడుతుంది కాబట్టి లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వీటివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాహన కండిషన్ను చెక్ చేయించుకోవాలి అని తెలిపినారు. అందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలి, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకరం. తొందరగా వెళ్లాలనే ఆత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎల్లప్పుడూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. కొంతమంది నగరవాసులు ట్రాఫిక్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. కేవలం బైకులే కాకుండా ప్రైవేట్ బస్సులు, ఆటోలు, కార్లు కూడా రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నాయి. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి తీవ్రంగా గాయపడటం, మరణించిన సంఘటనలు కూడా గతంలో సంభవించాయి అని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు, ఇది చట్టరీత్యా నేరం అని తెలిపినారు. వారికి కలిగిన సందేహాలను కూడా వివరించారు. ఈ కార్యక్రమములో 150 మంది ఫైనాన్షియల్ కార్పొరేషన్ సిబ్బంది ఏ పి ఎస్ ఎఫ్ సి తెలంగాణా డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమ్.శ్రీనివాస్,జనరల్ మేనేజర్ పద్మాకర్ రావు,పాండు రంగరాజు,ట్రాఫిక్ ఎస్సై పాండు రంగరాజు ,పీ సీ అయాన్,హెచ్ జి శ్రీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *