బేగంపేట మయూరి మార్గ్ లో గత నాలుగు నెలల క్రితం మూసివేసిన రేషన్ దుకాణం 899 ను పునః ప్రారంభించేలా చూడాలంటూ మంగళ వారం నగర కాంగ్రెస్ నాయకులు గౌర పల్లి రమేష్ ఆధ్వర్యం లో మయూరి మార్గ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు హైద్రాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి జీ.ఫనీంద్ర ద్రారెడ్డి ,డీ ఎస్ ఓ రమేష్ లకు లిఖిత పూర్వక పిర్యాదు అందజేశారు.మయూరి మార్గ్ లో వున్న షాప్ ను అధికారులు సీజ్ చేశారని,దీంతో తాము సుదూరం లోని పాతిగడ్డ,భాఘవంతపూర్,శ్యాంలాల్ బిల్డింగ్ ,బ్రాణన్వాది లకు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాలని ,ఇది తమకు ఇబ్బంది గా వుందని వెంటనే మయూరి మార్గ్ లోని షాప్ ను తెరిపించి సరుకులు అక్కడే అందించాలని వారు అధికారులను కోరారు.దీంతో స్పందించిన అధికారులు రెండు మూడు రోజుల్లో షాప్ తెరిచి అక్కడే సరుకులు అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు గౌరపల్లీ రమేష్ తెలియ జేశారు.అధికారులను కలిసిన వారి లో జక్కుల కృష్ణ,కే.నర్సయ్య గౌడ్,ఎమ్ .లక్ష్మి నారాయణ,దళిత రత్న దర్గా కరుణాకర్, ఏ.బాలకృష్ణ తదితరులు వున్నారు.
