బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో గడచిన నాలుగు రోజులుగా మురుగు నీటి పరుగుతో రోడ్లన్నీ బురద మయంగా మారాయని,బస్తీ వాసులు వాపోతున్నారు.బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రారంభం కావడం తో పాఠశాలకు వెళ్లే చిన్నారులు మురుగు నీటి లోనే నడుచుకుంటూ వెళ్ళారు.ఓల్డ్ కస్టమ్స్ బస్తీ కమ్యూనిట్ హాలు ముందు రోడ్డంతా బురద మయంగా మారింది.మురుగు నీటి ప్రవాహం తో ఈ ప్రాంతం అంతా తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది అని స్థానికులు ఆరోపిస్తున్నారు .గడిచిన రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం,మురుగు నీరు రోడ్లపైకి చేరడం తో అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి వుందని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు.వాటర్ వర్క్స్ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతన్నారు.

