బేగంపేట మాతాజీ నగర్ ఎఫ్ టి ఎల్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత……….నేలమట్టం చేసిన జీ హెచ్ ఎం సి సిబ్బంది……పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు తో నిర్మాణాలు కూల్చివేత…… పర్యవేక్షించిన పోలీస్ అధికారులు…………..

బేగంపేట మాతాజీ నగర్ సర్వే నెంబర్ 194/8/1లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ,రెవెన్యూ,పోలీస్ అధికారులు పర్యవేక్షణలో జీ హెచ్ ఏం సీ అధికారులు గురువారం ఉదయం కూల్చివేశారు.కూల్చి వెతల సందర్భంగా నార్త్ జోన్ డీ సీ పీ రోహిణీ ప్రియదర్శిని నేతృత్వంలో బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణ మూర్తి ఆధ్వర్యం లో తిరుమలగిరి ఏ సీ పీ, పెద్ద సంఖ్యలో పోలీస్,జీ హెచ్ ఏం సీ సిబ్బంది పాల్గొని జే సీ బీ ల సహాయం తో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేశారు.సర్వే నెంబర్ 194/8/1లో వున్న 10ఎకరాల 20 గుంటల స్థలాన్ని హుస్సేన్ సాగర్ ఎఫ్ టి ఎల్ గా అధికారులు పేర్కొన్నారు.ఈ స్థలం లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదు అని అధికారులు గతం లో ఇక్కడ నిర్మించిన నిర్మాణాలను కూల్చి వేశారు.అయితే స్థలం లో ప్రభుత్వ స్థలం అంటూ ఎలాంటి సూచిక బోర్డు లు ఏర్పాటు చేయక పోవడం తో భూ కబ్జా దారుల కన్ను ఈ స్థలం పైన పడింది.వెంటనే రంగం లోకి దిగిన వారు స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్మకాలు చేసారు. ఇదే సమయం లో కొందరు స్థలంలో నిర్మాణాలు చేశారు.అయితే అధికారులు అది ఎఫ్ టి ఎల్ అని పేర్కొంటూ పలు మార్లు కూల్చివేసిన తర్వాత కూడా ఆ స్థలాన్ని ఏదో ఒక విధంగా చేజిక్కించుకునేందుకు కొందరు మాత్రం ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.తాజాగా ఆ స్థలం లో ఓ ప్రార్ధనా మందిరాన్ని నిర్మించారు.ఈ నిర్మాణం తో మత విద్వేషలు రెచ్చగొట్టే విధంగా వుందంటూ బీ జె పీ సీనియర్ నాయకులు నెమలి ఆనంద్(నందు).మాతాజీ నగర్ బస్తీ అధ్యక్షుడు నరేష్ ల ఆధ్వర్యం లో ,బీ జె పీ డివిజన్ అధ్యక్షుడు గోవింద్,ప్రధాన కార్యదర్శి మైసూర్ మదు,సందీప్ వర్మ,తారకం పేట శ్రావణ్ కుమార్, లక్ష్మణ్,కృష్ణ,లక్ష్మీనారాయణ,సాయిలు,చంద్రకళ, సునీత,శోభ,మంగ,ఉషా,దేవిక,గంగారం తదితరులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి గ్రీవెన్స్ సెల్ లో మాతాజీ నగర్ ఎఫ్ టి ఎల్ లో అక్రమ నిర్మాణాలతో పాటు ప్రార్థన మందిరాన్ని వెంటనే తొలగించాలని లిఖిత పూర్వక పిర్యాదు చేశారు.అలాగే హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్త కోట శ్రీనివాసరెడ్డి నీ కలిసి పిర్యాదు చేశారు. నార్త్ జోన్ లా అండ్ ఆర్డర్ ఆదిశినల్ డీ సీ పీ పీ.అశోక్,సికింద్రబాద్ జీ హెచ్ ఏం సీ జోనల్ కమిషనర్ రవికిరణ్,బేగంపేట ఎస్సై రవిచంద్ర లకు పిర్యాదులు అందజేశారు.మంగళ వారం ప్రజావాణి కార్యక్రమం లో సైతం అధికారులకు పిర్యాదు చేసారు.బుధవారం మరోమారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొత్రు,డిప్యూటి కలెక్టర్ చంద్రావతి లను కలిసి లిఖిత పూర్వక పిర్యాదు చేశారు.స్పందించిన వారు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ బాలానగర్ తహశీల్దార్ శ్రీనివాస్ ను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రభుత్వ స్థలాలను కాపాడాలి….బీ జె పీ సీనియర్ నాయకులు నెమలి ఆనంద్ (నందు)……….
ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ అధికారులు రక్షించాలని బీ జె పీ సీనియర్ నాయకులు నెమలి ఆనంద్ (నందు) డిమాండ్ చేశారు.బేగంపేట మాతాజీ నగర్ హుస్సేన్ సాగర్ ఎఫ్ టీ ఎల్ స్థలం లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని ఆనంద్ డిమాండ్ చేశారు. కూల్చి వేసిన స్థలం ప్రభుత్వ అధికారులు పరిరక్షించాలని కోరారు. ఆ స్థలం లో ప్రభుత్వ బోర్డు లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.ఈ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగ పడే లా చర్యలు తీసుకోవాలన్నారు.అక్రమార్కుల ఆగడాలను అరికట్టాలని,వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గురువారం ఉదయం
భారీ ఎత్తున కదలి వచ్చిన అధికారులు…..

గురువారం ఉదయం మాతాజీ నగర్ సర్వే నెంబర్ 194/8/1 లో 10 ఎకరాల 20 గుంటల ఎఫ్ టి ఎల్ స్థలం
లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు కూల్చి వేసారు.సికింద్రబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్,డిప్యూటి కమీషనర్ సమ్మయ్య,బాలానగర్ తహశీల్దార్ శ్రీనివాస్,ఆర్ ఐ లు శ్రీదేవి,గాయత్రి తదితరుల తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *