సాంఘిక సంక్షేమశాఖా, దివ్యాంగుల, సచివాలయ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టిటిపి పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యను ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఎపీయూడబ్యుజే) నాయకులు సోమవారం నాయుడుపాలెం, ఒంగోలులలో కలిసారు. ఎపీయూడబ్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ఆధ్వర్యంలో ఏపీయూడబ్యుజే నాయకులు స్టేట్ కౌల్సిల్ సభ్యులు కోనూరి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆలుగుల సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట సురేష్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి కనకయ్య. జిల్లా యూనియన్ నేతలు బి వెంకట రావు, శ్రీనివాసరావు,శంకర్, జైరామ్ సర్వేశ్వర రావు తదితరులు పాల్గొని జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలని, అండగా ఉండాలని కోరారు. ముందుగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.


