ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాతలు చేయూత ఇవ్వటం అభినందనీయమని తాళ్లూరు మండల విద్యాశాఖాధికారి -2 ఎల్ సుధాకర రావు అన్నారు. శివ రామపురం ప్రాధమిక పాఠశాల (జనరల్)లో సోమవారం విద్యార్థులకు దాతలు కావలికి చెందిన గనుపూడి పవన్ కుమార్ ఆయన తల్లి సుబ్బరత్తమ్మ జ్ఞాపకార్థం ఐదు వేల విలువైన, పొదిలి వర్తక సంఘం నాయకులు గునుపూడి భాస్కర్ వారి తల్లిదండ్రులు సుబ్బారావు, వరలక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఐదు వేలు మొత్తం పది వేల విలువైన నోట్ పుక్స్, అభ్యసన సామగ్రిని ఎంఈఓ-2 ద్వారా విద్యార్థులకు అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి శ్రీనివాస్, ఉపాధ్యాయులు వీర నాగి రెడ్డి, కళ్యాణ్ రావ్, వేణు, అరుణ పాల్గొన్నారు.



