“ఏక్ పేడ్ మా కే నామ్”అమ్మ పేరున మొక్కలు నాటిన విజయ రావు

ఒంగోలు నగరంలోని స్థానిక 15వ డివిజన్ సంతపేట పరిధిలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటమని తెలిపారు. వారు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం తమ తల్లి కమలమ్మ గుర్తుగా ఒక మొక్కను నాటి ఆ ఇంటి యజమానురాలు అరుణ కి దత్తత ఇచ్చారు. వారు కూడా సంతోషంగా ఆ మొక్కను జాగ్రత్తగా చూసుకుంటామని వారికి మాట ఇవ్వడం జరిగినది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఇదేవిధంగా అదే డివిజన్లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తీగల సత్యవతి తన తల్లి పేరున ఒక మొక్క నాటడం జరిగినది. గృహ యజమాని శ్రీనివాస రావు కి దత్తత ఇచ్చారు.

ఈ సందర్భంగా విజయరావు మాట్లాడుతూ మనం నాటిన మొక్క ఒక్కటైనా జాగ్రత్తగా చూసుకుంటే పెరిగి పెద్దదై వృక్షమౌతుందని, దాని ఫలాలు భావితరాలకు ఉపయోగపడతాయని తెలిపారు. వందల మోక్కలు నాటి వాటికి పోషణ చేయకపోతే మనం ఆశించిన ఫలితాలు రావని, మన ప్రధాన ఉద్దేశం దెబ్బతింటుందని తెలియజేశారు.

ఈ యొక్క కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు. భాజపా జిల్లా కార్యదర్శి మరియు జిల్లా ఇన్చార్జ్ తిగల సత్యవతి. మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *