రైల్వే హాస్పిటల్ రక్షణ ప్రయాణికుల భద్రత లను కాపాడటంలో ఆర్పిఎఫ్ కృషి అమోఘమని పలువురు కొనియాడారు. జూన్ నెలలో ఆర్పిఎఫ్ మెరుగైన సేవలను సాధించింది. ఆపరేషన్ యాత్రి సురక్ష ద్వారా ఆర్పిఎఫ్ దక్షిణ మధ్య రైల్వే 45 కేసులను నమోదు చేసి 38 మంది నేరస్తులను అరెస్టు చేసి దొంగతనానికి గురైన రూ 20.63 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆపరేషన్ అమానత్ అనే కార్యక్రమం ద్వారా ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను ఆర్పిఎఫ్ సిబ్బంది సేకరించి వాటిని బాధితులకు అప్పగించారు జూన్ నెలలో ఆర్పీఎఫ్ సిబ్బంది 193 మంది ప్రయాణికులకు సంబంధించిన 50 లక్షల పై విలువ గల సామాన్లను సురక్షితంగా కాపాడే యజమానులకు అందించారు. రైల్వే ద్వారా మాలికద్రవేయుల అక్రమ రవాణా అరికట్టేందుకు ఆర్పిఎఫ్ ఆపరేషన్ నార్కోస్ ను ప్రారంభించింది ఈ ఆపరేషన్ కింద ఆర్పిఎఫ్ జూన్ మాసంలో 12 మంది వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు 71 లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ఫారెస్ట్ ఇన్ ద వివిధ కారణాలతో ఇంటి నుండి తప్పిపోయిన పారిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు దీని ద్వారా వంద మంది పిల్లలకు భద్రత కల్పించారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆపరేషన్ ఆహ్టే ప్రారంభించింది 18 మంది మానవ అక్రమ రవాణా దారులు భార్య నుంచి 27 మంది బాలురను ఒక బాలికను రక్షించింది. ఆపరేషన్ జీవస్ రక్ష కింద ఒక పురుషుడు ప్రాణాలను మృత్యు బారి నుంచి కాపాడింది. ఆపరేషన్ సాటర్క్ కింద రైళ్లలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ 88 0 విలువైన మధ్యాన్ని సీజ్ చేసి ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసి వారిని ఎక్సైజ్ శాఖకు అప్పగించారు ఎక్సైజ్ శాఖ నేరస్తులపై నాలుగు కేసులు నమోదు చేశారు. దక్షిణ మధ్య రైల్వే టికెట్ దళారుల కార్యకలాపాల నరకట్టడానికి మరియు సామాన్లకు రైల్వే టికెట్లు అందుబాటులో ఉంచడానికి ఆపరేషన్ ఉప్పలబ్ కింద జూన్ నెలలో 12 మంది దళారుల అరెస్టు చేయడం ద్వారా 11 కేసులను నమోదు చేశారు 51 లైవ్ టికెట్లు,1,29,340 ల విలువైన టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ సాంకేతికను ఉపయోగించుకొని ముగ్గురు నిరసనను పట్టుకొని వారి వద్ద నుంచి 1,60,000 విలువైన దొంగిలించబడిన ప్రయాణికుల ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఆస్తి ధ్వంసానికి సంబంధించిన నేరాలను అరికట్టే కార్యక్రమాల కోసం ఆపరేషన్ రైలు సురక్ష అనే కార్యక్రమాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చేపట్టింది మూడు లక్షల 89వేల762 విలువచేసే దొంగిలించబడిన రైల్వే సొత్తును రికవరీ చేయడంతో పాటు నేరస్తుల పైన 52 కేసులను నమోదు చేశారు.

