రాష్ట్ర ఐటీ మరియు కమ్యూనికేషన్, విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ను సచివాలయంలోని ఆయన చాంబర్ లో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా పదవి చేపట్టాక మొదటిసారిగా కలిసిన వేణుబాబు నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ తెదేపా నాయకుల కృషిని నారా లోకేష్ కు తెలియజేసి, అన్ని విధాల దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలుస్తుంది. దర్శి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కొరకు తెలుగు యువత చేస్తున్న కృషిని లోకేష్ బాబు గుర్తు చేస్తూ ప్రశంసించినట్లు తెలుస్తుంది. తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధికి పూర్తీ సహకారం అందించాలని నారా లోకేష్ ను గొల్లపూడి వేణుబాబు కోరగా పూర్తి సహకారం అందిస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ కొరకు కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపు గౌరవం తప్పక దక్కడం ఖాయమని లోకేష్ బాబు అన్నట్లు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు తెలియజేశారు.
