తాళ్లూరు మండలం మల్కాపురం , రజా నగరం గ్రామాలలో కెవికెల స్వర్ణోత్సవ జ్యోతి యాత్రను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి కార్యక్రమ సమన్వయకర్త డా. జి రమేష్ గారు మాట్లాడుతూ…. కెవికెల స్వర్ణోత్సవ జ్యోతి వేడుకల గురించి రైతులకు వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రాలు రైతుల అభ్యున్నతికి ఏ విధంగా తోడ్పడుతున్నాయి, రైతుల సమాచార నిధుల కేంద్రాలుగా కె వి కెలు అవతరించాయన్నారు . కెవికెల ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా దర్శి కేవీకే ద్వారా జిల్లాకు అనుకూలమైన నూతన వంగడాలను రైతులకు చేరవేస్తున్నట్లు తెలియజేశారు. విస్తృతస్థాయిలో క్షేత్ర పరిశీలనలో చేపడుతున్నట్లుగా వివరించారు. రైతులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫోన్ కాల్ ద్వారా అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆహార భద్రత సంస్థ వారి సౌజన్యంతో కేవీకే ద్వారా సామూహిక ప్రదర్శన క్షేత్రాల క్రింద కంది రకం ఎల్ .ఆర్ .జి 105 విత్తనాన్ని రైతులకు అందజేయడం అందజేశారు. అనంతరం కంది సాగులో చేపట్టవలసిన సాగు, సస్యరక్షణ పద్ధతులు, రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులను గురించి రైతులకు వివరించారు. గ్రామ సర్పంచి షేక్ వలి ముఖ్యఅతిథిగా పాల్గొని విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కె వి కె శాస్త్రవేత్తలు డాక్టర్ పి వెంకటేశ్వర రెడ్డి, టీ మానస, మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు, రైతులు పాల్గొన్నారు




