సోషల్ మీడియాలో తప్పుడు కంటెంట్ తో ప్రచారం చేస్తే చర్యలు…….రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద…………………….

సోషల్ మీడియాలో తప్పుడు కంటెంట్ తో ప్రచారం చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించడం , చట్ట పర రమైన కంటెంట్,నైతిక మరియూ పబ్లిక్ ఆర్డర్ ప్రమాణాలకు కట్టుబడి వుండాలని ఆదేశాలు జారీ చేశారు.భావ ప్రకటన స్వేచ్చ అనేది రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(1) (ఏ)లో పొందుపర్చిన ప్రాథమిక హక్కు అని అయితే ఈ హక్కు ఆర్టికల్ 19(2) ప్రకారం పరిమితులకు లోబడి వుంటుందన్నారు.తండ్రి కూతుళ్ళ వీడియో కు సంబంధించి ఇటీవల కాలంలో కలకలం రేపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు.సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిని ఆర్టికల్ 19(2) ప్రకారం చేయాలని,కంటెంట్ రైటర్లు బేసిక్ డీసెన్సీ నైతికతకు ప్రాధాన్యతా ఇవ్వాలని ఆమె సూచించారు.మహిళల భద్రతకు సంబంధించి ఇప్పటికే వున్న చట్టాల ప్రకారం ఏ వ్యక్తి(లు)సృష్టించిన కంటెంట్ నేరం కాకూడదని అన్నారు.ఒక వేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునే హక్కు కమీషన్ కు వుందన్నారు.భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు లోబడే కంటెంట్ వుండాలని కమీషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారద వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *