గిన్నిస్ బుక్ రికార్డు సాధన లో భాగంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని, వాసవి క్లబ్స్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన గుప్త 105వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే వాసవి వారోత్సవాల్లో భాగంగా 1 నుండి 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ నిర్దేశించిన రక్త సేకరణలో గిన్నిస్ రికార్డు సాధించడమే కాకుండా సామాజిక సేవలో వాసవి క్లబ్ సభ్యులు ముందుంటారని తెలియ చెప్పడం, ప్రాణదాతలుగా సమాజానికి మరింత విస్తృత సేవలు అందించడం లక్ష్యంగా ఈ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని వాసవి క్లబ్ అంతర్జాతీయ కోశాధికారి సిద్ధ సూర్యప్రకాష్ రావు తెలిపారు.
వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ కెసిజిఎఫ్ యూత్ ఒంగోలు వారు సంయుక్తంగా స్థానిక దక్షిణం బజారు లోని శ్రీ సంపత్ కుమార్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శిద్దా సూర్యప్రకాశరావు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. వాసవిక్లబ్స్ ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల సేవాకార్యక్రమాలు జరుగుచున్నాయని, వాసవియన్ల సేవలు అనన్య సామాన్యంగా అభివర్ణించారు. ఈ వారోత్సవాలలో 2వ తేది కాలేజెస్, ఇన్టిట్యూషన్స్ లొ రక్తదాన శిబిరములు ఏర్పాటు చేసి విద్యార్ధులచే రక్తదాన ఉద్యమంలో భాగస్వాములను చేయడం, 3వతేది వృద్ధాశ్రమాలు అనాధాశ్రమాల్లో సేవలు, 4వ తేది మహిళలు యువతులకి సాధికారిక కార్యక్రమాలు, 5వ తేది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భముగా గురువులను సన్మానించడం, 6వ తేది పాత్రికేయ దినోత్సవం సందర్భంగా పాత్రికేయుల సన్మానించడం, 7వ తేది శ్రేయోభిలాషి దాతలను సత్కరించడం జరుగుతుందని తెలిపారు. వాసవి జిల్లా 205 లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల ఇంఛార్జ్ జి. బ్రహ్మానందం మాట్లాడుతూ జిల్లాలోని 60 క్లబ్స్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయని, మూడు, నాలుగు రోజుల్లో గిన్నిస్ రికార్డు విషయం తెలుస్తుందని, ఆదివారం నగరంలోని క్లబ్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నవ్య, విజన్ బ్లడ్ బ్యాంకుల సహకారంతో 70 యునిట్ల ను సేకరిండం జరిగినదని తెలిపారు, రక్తదాన ఆవశ్యకత పై ప్రసంగించారు.
కార్యక్రమంలో ఒంగోలు క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి బదరినారాయణ, యూత్ అధ్యక్షులు కూనల శ్రీనివాసరావు, వాసవి క్లబ్ అద్దంకి వివి ఆదినారాయణ, వనిత ప్రెసిడెంట్ వి విజయలక్ష్మి, జిల్లా బ్లడ్ మరియు ఆర్గాన్ డొనేషన్ అడ్మినిస్ట్రేషన్ ఛైర్మన్ దర్శి మనోహర్ చంద్రశేఖర్, విసిఐ డైరక్టర్ ఉమా అన్నపూర్ణ, జిల్లా అధికారులు, క్లబ్ కార్యవర్గ సభ్యులు, సభ్యులు, రక్తదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రక్తదాతలకు ప్లోత్సాహక కానుకను అందించారు. మరియు పేద మహిళలకు చీరలు పంపిణి చేశారు.


