నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శం గా తీసుకోవాలి.. అంటరానితనంపై ఆయన పోరాటం ఆదర్శం.. డిసిసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ అడపా.

బేగంపేట ఏప్రిల్ 14 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శం గా తీసుకోవాలనీ, సికింద్రాబాద్ జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ అడపా అన్నారు. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ అంటరానితనంపై అంబేద్కర్ చేసిన పోరాటం ఆదర్శం అన్నారు.అలాగే అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ కె దక్కుతుందని అభిషేక్ కొనియాడారు ఈ కార్యక్రమంలో హనీఫ్ ఖాన్, అల్తమాష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *