వరద బాధితుల సహాయార్ధం తాళ్లూరు వాసి, బెంగుళూరులో వ్యాపార వెత్త, సీపీ బ్రౌన్ సేవా సమితి వ్యవస్థాపకులు ఇడమకంటి లక్ష్మి రెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించారు. జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియాను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలిసి రూ. లక్ష చెక్కును అందించారు. ఆయన వెంట తాళ్లూరు వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు.
