విద్యుత్ స్తంభాల నుంచి నివాసాలలోకి వేసుకున్న వైర్ కాలిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ కాంగ్రెస్ నేతలు సనత్ నగర్ నియోజకవర్గం బి బ్లాక్ మాజీ అధ్యక్షుడు షేక్ గౌస్ ఆధ్వర్యంలో ఎన్ బి టి నగర్ రైలు పట్టాల సమీపంలో నివసిస్తున్న గుడిసె వాసుల వద్దకు చేరుకుని వారి సమస్యను తెలుసుకున్నారు. విద్యుత్ వైరు కాలిపోవడంతో తమకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, స్థానికులు కాంగ్రెస్ నేతల దృష్టికి తీసుకువచ్చారు .ఈ సమాచారాన్ని వెంటనే కాంగ్రెస్ నాయకులు బేగంపేట విద్యుత్ శాఖ ఏఈ మధుసూదన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఏ ఈ సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపించి సమస్యను పరిష్కరించారు. అదే ప్రాంతంలో డ్రైనేజీ పొంగిపొర్లుతున్న విషయాన్ని గుర్తించి వెంటనే వాటర్ వర్క్స్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా షేక్ గౌస్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అభిషేక్ అడపాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటిని ఒకటొకటిగా అమలు చేస్తుందన్నారు .సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనీఫ్ ఖాన్ నసీరుద్దీన్ అడ్డు బబ్లు సాయి తదితరులు పాల్గొన్నారు.

