సత్యం, అహింస సిద్ధాంతాలతో స్వరాజ్య స్ఫూర్తిని రగిలించిన జాతిపిత మహాత్మాగాంధీ 155 వ జయంతి సందర్భంగా కూకట్ పల్లి నియోజక వర్గం బేగంపేట డివిజన్ శ్యామ్ లాల్ బిల్డింగ్ మెయిన్ రోడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హోసీ టోచెర్ మాట్లాడుతూ బాపూజీ ఎంచుకున్న మార్గం నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైపాల్ రావు,నరసింగరావు,నరసింహ యాదవ్,టి.ఎం.యాదగిరి,శ్రీరాములు,తదితరులు పాల్గొన్నారు.
