శిశు గృహాలో ఆశ్రయం పొందుతున్న నలుగురు చిన్నారులను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎ తమీన్అన్సారియా ఆధ్వర్యంలో కర్నాటక, హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దపంతులు దత్తత తీసుకున్నారు. బెంగుళూరు, హైదరా బాద్ ల లో సాఫ్ట్ వేర్ రంగాలలో స్థిర పడిన దంపతులు సెట్రల్ అడప్సన్ రిసోర్స్ అధారిటీలో ఆన్ లైన్ ద్వారా 2021 సంవత్సరంలో నమోదు చేసుకున్నారు. సీనియారిటి ప్రకారం వారికి శిశు గృహాలో చిన్నారులను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …చూడ చక్కగా ఉన్న చిన్నారులను స్వంత బిడ్డల వలే వీరి భవిష్యత్‌కు ఉన్నతంగా తీర్చిదిద్దాలని దత్తత తల్లిదండ్రులకు సూచించారు. వారు జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరినదని ఆనందం వ్యక్తం చేసారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్, పీఓ లక్ష్మి, మెనేజర్ రషా హేరియట్ తదితరులు పాల్గొన్నారు.

