ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో త్వరలో జరగనున్న టీ 20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉప్పల్ స్టేడియంలో డీసీపీలు, ఏసిపిలు, జిహెచ్ఎంసి, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మరియు హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ ….. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశం అని, ఎన్ని సవాళ్ళు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.
