ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సాంఘిక సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖల ద్వారా నిరుపేద ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఉచిత వసతి మరియు ఉచిత భోజనాది సదుపాయాలతో డీఎస్సీ శిక్షణను పేరు ప్రఖ్యాతలు గడించిన ప్రైవేటు శిక్షణ సంస్థలను గుర్తించి వాటి ద్వారా ఇప్పించవలెనని ఇందుకు సంబంధించి శిక్షణా సంస్థల యజమానులు మరియు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు ఈనెల 25వ తేదీ తుది గడువుగా నిర్ణయించి ఉన్న విషయము విదితమే. కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరికొంత కాలం గడువును పొడిగించవలెనన్న ఉద్దేశముతో ఈనెల 27 తేదీ వరకు దరఖాస్తు చేసుకొనుటకు వీలుగా జ్ఞానభూమి వెబ్ పోర్టల్ నందు సేవలను అందుబాటులో ఉంచడం జరిగినదనిజిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమము మరియు సాధికారత అధికారి ఎన్. లక్ష్మా నాయక్ తెలిపారు.
ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు మరియు శిక్షణ సంస్థల యాజమాన్యాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
ఉచిత డీఎస్సీ శిక్షణ కొరకు దరఖాస్తు గడువు 27 వరకు పొడిగింపు -జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమము మరియు సాధికారత అధికారి ఎన్. లక్ష్మా నాయక్
25
Oct