తాళ్లూరుమండలంలోని గుంటిగంగ సన్నిధిలోని గుంటిగంగ బ్రాహ్మణ సత్రంలో కార్తీక మాసం సందర్భముగా ఆదివారం సామూహిక సత్యన్నారాయణస్వామి వ్రతకార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రాహ్మణసత్రం అధ్యక్షురాలు యల్లాప్రగడ లక్ష్మీ సుందరి మండల బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మణ దంపతులు సామూహిక సత్యన్నారా యణ వత్రం చేపట్టారు. నాలుగేళ్లుగా కార్తికమాసం సందర్భంగా వేదపండితుల సారద్వర్యంలో సత్యన్నారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణులు అధికసంఖ్యలో పాల్గొని వ్రతాన్ని తిలకించి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సత్రం అభివృద్ధికి దాతల సహకారం ఎంతో వున్నదని, బ్రాహ్మాణ సత్రంలో భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని అధ్యక్షురాలు లక్ష్మీ సుందరి తెలిపా రు. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక సంఖ్యలో సత్యన్నాయణ స్వామి వ్రతానికి దంపతులు హాజరు కావడం
ఆనందదాయకమన్నారు. శాశ్వత అన్నదానంకు సహకారం అందించాలని విన్నవిం చారు. ఈ సందర్భముగా బ్రాహ్మణులు సామూహిక వనభోజన కార్యక్రమం చేపట్టారు. సత్రం నందు సామూహిక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, గోమాతపూజా కార్యక్రమాలు నిర్వహించారు. సత్రం కమిటీ ఆద్వర్యంలో సత్రం అభివృద్ధికి కృషి చేస్తున్న పెద్దలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సత్రం కమిటీ అధ్యక్షు రాలు యల్లాప్రగడ లక్ష్మీ సుందరి,సత్రం కమిటీబాధ్యులు వై.కన్నయ్య, ఆర్వై కోటేశ్వ రరావు, నరసింహారావు, దీక్షితులు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, నాగరాజు, వెంకటే శ్వరి, తదితరులుపాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించేస్తున్న పెద్దలను ఘనంగా సత్కరించారు.
