విద్యార్థులకు చదువులతో పాటు క్రీడలు కూడా ఒక భాగం కావాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ అన్నారు.మంగళవారం ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన 17వ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులకు చదువులతోపాటు క్రీడలు కూడా ఒక భాగం కావాలన్నారు. జీవితంలో క్రీడలు – నాయకత్వం, జవాబుదారీతనం, సహనం, ఆత్మవిశ్వాసం, జట్టుకృషి వంటి జీవన నైపుణ్యాలు నేర్పించడంలో ఎంతగానో దోహద ‘ పడతామని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా బోధన తో పాటు క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడలకు, క్రీడాకారులకు గొప్ప భవిష్యత్తు ఉందని, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఉద్యోగ నియామకాల్లో ఇస్తున్న రిజర్వేషన్ ను రెండు నుంచి మూడు శాతానికి పెంచిందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ నైపుణ్యం ఉన్న క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.
ముందుగా జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణ క్రీడా పతాకావిష్కరణ చేశారు. ఫ్లాగ్ మార్చ్ తిలకించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోటీలకు హాజరైన బాల బాలికల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన క్రీడా విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రీడల్లో విశేష ప్రతిభ కనుబరచిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందచేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సురేష్ కుమార్, యు బి ఐ మేనేజర్ శ్రీ ప్రసాద్ సాహు, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, ప్రిన్సిపాల్కే మనీష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శివరాం, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సూర్య ప్రకాశరావు, కేంద్రీయ విద్యాలయం అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.




