పొగాకు సాగు రైతులు అప్రమత్తంగా ఉండాలి – పొగాకు బోర్డు సభ్యులు మా రెడ్డి సుబ్బా రెడ్డి

పొగాకు సాగు రైతులు అంతర్జాతీయ మార్కేట్ను గమనించి సాగు చేసుకోవాలని భారత పొగాకు బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బా రెడ్డి కోరారు. గడచిన మూడు సంవత్సరాలుగా మన దేశంలో పండిన పొగాకు 70శాతం ఎగుమతి చేయబడుతుందని, అంతర్జాతీయంగా పొగాకు రిమాండ్ రావటంతో అంచనాలకు మించి పొగాకు ధరలు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం బ్రేజిల్, జింబాబ్వే ఇతర ప్రధాన దేశాల నుండి పంట పరిమాణం గరిష్ట స్థాయికి పెరుగుతున్న నేపధ్యంలో ఇది ప్రపంచ పొగాకు మార్కేట్లో మిగులు నిల్వలకు దారితీసే అవకాశం ఉన్నదన చెప్పారు. మైసూర్ మార్కేట్లో వ్యాపారుల మధ్య పోటీ లేని తత్వం కనిపిస్తోందని అన్నారు. మధ్య రకం, లో గ్రేడ్ పొగాకు కొనుగోలు దారులు లేని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ఈ పరిస్థితిని ముందస్తుగా అంచనా వేసిన ఇండియా టుబాకో బోర్డ్ అసోషియేషన్ 2025 పంట కాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. అన్ని పరిస్థితులను పొగాకు రైతులు గమనించి అత్యధికంగా, అనధికారికంగా సాగు చేసి ఆర్థిక నష్టాలు కొనితెచ్చుకోవద్దని రైతులకు విన్నవించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *